కష్టాల కడలిలో క్రియోటివ్ డైరెక్టర్ రంగ మార్తాండ …ఆగిపోతుందా ..?

-

ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగామార్తండ సినిమాలో మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ తో పాటు రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక… కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక్కప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో మురారి, ఖడ్గం వంటి సంచలనమైన సినిమాలు తీశారు దర్శకుడు కృష్ణవంశీ. స్టార్ హీరోలతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు సాధించిన కృష్ణవంశీ గత కొంత కాలంగా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. కృష్ణవంశీ నుంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. రాం చరణ్ తో తీసిన గోవిందుడు అందరివాడే కూడా నిరాశనే మిగిల్చింది.

 

అంతేకాదు ఈ సినిమా తర్వాత సందీప్‌ కిషన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో నక్షత్రం సినిమా తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ సినిమా ఘోర పరజయాన్ని చూసింది. ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా రైతు అనే సినిమా అనుకున్నప్పటికి ఆ ప్రాజెక్ట్ ఆదిలోనే ఆగిపోయింది. ఇక చాలా గ్యాప్ తరాత మరాఠిలో ఘన విజయం సాధించిన నట సామ్రాట్‌ సినిమాను తెలుగులో రంగమార్తండ పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు కృష్ణవంశీ.

 

అయితే ప్రస్తుతం ఈ సినిమాని నిర్మించాలనుకున్న నిర్మాతలు డ్రాపయ్యారని తాజా సమాచారం. ప్రస్తుతం కరోనా ప్రభావంతో కొత్త సినిమాలు నిర్మించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మొదలైన సినిమా ఆగిపోయిందంటే సెంటిమెంట్ పరంగా కూడా కొంతమంది అంత ఈజీగా ప్రాజెక్ట్ ని టేకప్ చేయరని మరో మాట వినిపిస్తుంది. మరి కృష్ణవంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కృష్ణవంశీ ఈ సినిమాని వేరే నిర్మాతతో కంటిన్యూ చేస్తాడా లేక మొత్తానికే ప్రాజెక్ట్ ఆగిపోతుందా అన్నది త్వరలో తెలుస్తుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news