బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ‘కస్టడీ’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

-

థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో ఫ్లాపులు మూటగట్టుకున్న యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమాతో ఇటీవలే థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమా ద్వారా అయినా హిట్ కొట్టాలని ప్రయత్నించిన చైకి ఈసారీ నిరాశే ఎదురైనట్లు కనిపిస్తోంది. తమిళ డైరెక్టర్​ వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన కస్టడీ మే 12న థియేటర్లలో రిలీజై  డీసెంట్​​ టాక్​ను అందుకుంది.

అయితే ఈ సినిమా ఫలితంపై మిశ్రమ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొంతమంది బాగుందని అంటుంటే మరికొంతమంది మాత్రం ఆశించిన స్థాయిలో లేదని కూడా అంటున్నారు. వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని.. కాస్త నిరాశపరిచిందని సమాచారం. వరల్డ్ వైడ్​గా రూ.4కోట్ల గ్రాస్​ కన్నా తక్కువ వచ్చాయని తెలిసింది.

ఇకపోతే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమాకు రూ. 2.30 నుంచి రూ. 2.50 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలిసింది. అలాగే.. తమిళంతో పాటు మిగతా ప్రాంతాలను కూడా కలిపితే మొత్తంగా రూ. 3.30 కోట్ల నుంచి రూ.3.50 కోట్ల వరకు వచ్చాయట.

అలానే యూఎస్​ఏలో ప్రత్యం​గిరా సినిమాస్​ కస్టడీ చిత్రాన్ని విడుదల చేసింది. అక్కడ తొలి రోజు(ప్రీమియర్స్​తో కలిపి) లక్ష డాలర్స్​ మార్క్​ను క్రాస్ చేసిందని ప్రత్యం​గిరా సినిమాస్ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news