తన చిరకాల ప్రియుడు ఎవరో చెప్పేసిన రష్మిక..!

-

కన్నడ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు పలు బ్రాండ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప ది రూల్ మూవీ తో పాటు తమిళ్లో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. వారసుడు సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోని పంచుకుంది.

అందులో ఒక యానిమేటెడ్ సీరీస్ టాయ్ ని చేతిలో పట్టుకొని అతడే నా చిరకాల ప్రేమికుడు అంటూ రాసుకుంది. జపాన్ కు చెందిన యానిమేటెడ్ సిరీస్ నరుటో తనకు ఎంతో ఇష్టమని తెలిపిన రష్మిక ఆ సీరీస్ అంటే కూడా చాలా ఇష్టమని కామెంట్లు చేసింది. ఇకపోతే రష్మిక షేర్ చేసిన ఈ పోస్ట్పై నెటిజన్ లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ సీరీస్ అంటే తమకు కూడా ఇష్టం అని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం మేకప్ లేకుండా ఫోటోను ధైర్యంగా షేర్ చేయడం నీ ధైర్యానికి నిదర్శనం అని అంటున్నారు.

సోషల్ మీడియాలో రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో చాలా వైరల్ గా మారుతుంది. ఇకపోతే రష్మికకి ఒక్క తెలుగు, తమిళ్ లోనే కాదు హిందీలో కూడా బాగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే గుడ్ బై, యానిమల్, మిషన్ మజ్ను వంటి చిత్రాలలో నటించిన ఈమె ఇప్పుడు ఛవా అనే హిస్టారికల్ పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news