కాంగ్రెస్ మహిళా నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పై బీజేపీ నేత చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రియాంక గాంధీ మీద బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. బీజేపీ నాయకత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ సిగ్గు పడాలని సీరియస్ అయ్యారు. భారతీయ సంస్కృతి పై బీజేపీ నేతల దాడిగా గుర్తించాలని కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత రమేష్ బిదూరి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాను ఉద్దేశిస్తూ.. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన తాను గెలిస్తే.. స్థానిక రోడ్లను ప్రియాంక గాంధీ వాద్రా బుగ్గల్లా మారుస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.