లేటు వయసులో బోల్డ్ క్యారెక్టర్లు.. మరోసారి ధైర్యం చేస్తున్న రమ్యకృష్ణ

కొందరు హీరోయిన్లకు వయస్సు అయిపోతుంది గానీ.. అందం తగ్గట్లేదు. అలాగే యూత్ లో క్రేజ్ కూడా తగ్గట్లేదు. దీంతో లేటు వయస్సులో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు కొందరు హీరోయిన్లు. పెళ్లయి, పిల్లలున్నా.. తమ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఈ కోవలోనే రమ్యకృష్ణ కూడా పయనిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తో సినిమాలతో బిజీగా ఉంటున్న ఈమె.. అప్పుడప్పుడు సంచలన పాత్రలు చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు.

 

ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తూనే.. మరోవైపు బోల్డ్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. ఈ వయసులో మరీ ఇంత బోల్డ్ పాత్రలు చేయడమంటే సాహసమనే చెప్పాలి. కానీ రమ్యకృష్ణ మాత్ర అది చేసి చూపిస్తోంది. రెండేళ్ల క్రితం సూప‌ర్ డీల‌క్స్ సినిమాలో బోల్డ్ క్యారెక్ట‌ర్ చేసింది ర‌మ్య‌, ఇక అంత‌కుముందు కూడా మ‌ల‌యాళంలో హాట్ సన్నివేశాల్లో నటించి.. ఆశ్చర్య పరిచింది. తనకు కథ ముఖ్యం అని, క‌థ డిమాండ్ చేస్తే ఇప్ప‌టికీ బోల్డ్ సీన్ల‌లో న‌టించేందుకు అభ్యంత‌రం లేద‌ని హింట్ ఇచ్చేసింది.

ఇక ఇప్పుడు మ‌రోసారి బోల్డ్ పాత్ర‌లోనే వస్తోంది. వయసు అయిపోయిన తర్వాత కూడా హార్మోన్ల ప్రభావంతో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండే మ‌హిళ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంది. అప్పటికే భర్త చనిపోతే.. ఆమె పరిస్థితి ఏంటి.. తన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేసింది అనే కథాంశంతో ఓ సినిమా చేయబోతోంది. నిజానికి ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ లో నటించడానికి చాలా ధైర్యం కావాలి. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.