ఇంధన కొత్త రేట్లు.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

-

అంతర్జాతీయ చమురులో ముడి చమురు ధర స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో దేశీయ చమురు కంపెనీలు ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. వరుసగా 14వ రోజు వరకు చమురు కంపెనీల ఇంధన ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కానీ, ఏప్రిల్ 15వ తేదీన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను సవరించింది. దీంతో పెట్రోల్ లీటర్‌కు 16 పైసలు, డీజిల్ లీటర్‌పై 14 పైసలు తగ్గింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను మార్చి 3న, ఏప్రిల్‌లో ఒక రోజు తగ్గించారు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో స్వల్ప క్షీణత కనిపించింది. బ్రెంట్, డబ్ల్యూటీఐ బెంచ్ మార్క్ క్షీణించింది. డబ్ల్యూటీఐ ముడి చమురు 0.03 శాతం తగ్గడంతో.. బ్యారెల్‌కు 63.84 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ ముడి చమురు 0.10 శాతానికి పడిపోవడంతో బ్యారెల్ ధర 67.20 డాలర్లకు చేరుకుంది.

petrol-diesel
petrol-diesel

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.40, లీటర్ డీజిల్ ధర 80.73గా ఉంది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర రూ.96.83, డీజిల్ ధర రూ.87.81గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.90.62, డీజిల్ ధర రూ.83.61గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.92.43, డీజిల్ ధర రూ.85.75గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.93.43, డీజిల్ ధర రూ.85.60గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 93.99, డీజిల్ ధర 88.05గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్‌కు సంబంధించిన ధరలను ఇప్పుడు మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా పొందవచ్చు. మీ మొబైల్‌లో ఆర్ఎస్‌పీ అని టైప్ చేసి.. మీ సిటీ కోడ్ టైప్ చేసి.. ఫోన్ : 9224992249 మెసేజ్ పంపించాలి. ప్రస్తుతం అమలవుతున్న ధరలు మెసేజ్ రూపంలో పంపిస్తారు.

ముడి చమురు ఆధారంగా ధరల నిర్ణయం..
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిర్ణయించబడతాయి. చమురు కంపెనీలు గత 15 రోజులలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరను పరిగణలోకి తీసుకుంటాయి. దీంతో దేశీయ మార్కెట్‌ ఇంధన ధరను నిర్ణయిస్తాయి. చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తాయి. వీటి ఆధారంగా దేశంలో కొత్త ధరలు అమలు అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news