NANI : “దసరా” నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..ఊర మాస్ గా నాని

-

న్యాచురల్ స్టార్ నాని.. చూడ‌డానికి ప‌క్కింటి అబ్బాయిలా క‌నిపించే ఈ యంగ్ హీరో.. విన్నూత‌మైన‌.. విభిన్న‌మైన పాత్ర‌లు, సోర్టీలు చేస్తూ.. అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నాడు. వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ఇటీవ‌లి కాలంలో నానికి స‌క్సెస్ అనేది అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఇక ప్రస్తుతం హీరో నాని 29వ సినిమాకు రెడీ అవుతున్నారు.

మొన్నటి దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ ను అనౌన్స్‌ చేశాడు. “ద‌స‌రా” అనే టైటిల్‌తో నాని 29వ మూవీ తెర‌కెక్క‌బోతుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండ‌గా.. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌నున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి హీరో నాని ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ఫస్ట్‌ పోస్ట‌ర్‌లో నాని రగ్డ్ లుక్‌తో క‌నిపిస్తున్నాడు. ఊర మాస్ లుక్ లో కూడా నాని కనివిందు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news