Dasara: నాని దసరా మూవీ కలెక్షన్స్.. ఫైనల్ గా ఎంత రాబట్టాడంటే..?

-

నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం దసరా.. గత నెల ఆఖరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నాని కెరియర్ లోని ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఏకంగా నాని కెరియర్లు మొట్టమొదటి రూ .100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలవడం గమనార్హం. నాని కెరియర్ లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా హైయెస్ట్ షేర్ రాబట్టింది. ఇదంతా ఇలా ఉంటే లాంగ్ రన్ టైంలో తెలుగులో ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం.


1). నైజాం- రూ 25.3 కోట్లు.
2). సీడెడ్- రూ.5.3 కోట్లు
3). ఉత్తరాంధ్ర- రూ.4.5 కోట్లు
4). గుంటూరు- రూ.2.5 కోట్లు
5). తూర్పుగోదావరి- రూ.2.2 కోట్లు
6). పశ్చిమగోదావరి- రూ.1.45 కోట్లు
7). కృష్ణ- రూ.1.85 కోట్లు
8). నెల్లూరు- కోటి రూపాయలు.

మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.43.95 కోట్ల రూపాయల షేరును రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో సుమారుగా 7 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్లో నాని కెరియర్ లో హైయెస్ట్ షేర్ని దసరా సినిమా సాధించింది. మొత్తం ఓవర్సీస్ లో రూ .10.5 కోట్ల రూపాయల వరకు వచ్చింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.61.45 కోట్ల రూపాయల షేరును రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news