Dasara Movie : నాని, కీర్తిసురేశ్‌ దసరా లుక్‌ అదిరింది

టాలీవుడ్ హీరో నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుండగా శ్రీకాంత్ ఓడల దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవలే ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. లక్నో వేదికగా విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.

ఇందులో నాని మాస్ లుక్ చూసిన అభిమానులంతా సినిమాపై హైప్స్ పెంచుకోగా.. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని అలరించి మూవీ పై అంచనాలు మరింతగా పెంచాయి. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ నటించిన ‘దసరా’ కొత్త లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. పూరింటి ముందు గళ్ళ లుంగి, తెలుపు రంగు బనియన్ లో, గుబురు వెంట్రుకలు, గడ్డంతో నాని లుక్ అదిరింది. పల్లెటూరి మహిళగా డిగ్లామరైజ్డ్ లుక్ లో కీర్తి సురేష్ ఆకట్టుకున్నారు. పక్కా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా కనిపిస్తూ, విలేజ్ లవర్స్ అండ్ మూవీ లవర్స్ ను ఆకర్షిస్తు న్నారు.