సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న దీపికా.. మ‌రీ ఇంత అంద‌మా!

ఓ పిల్ల టిక్ టాక్‌లో బాగా ఫేమ‌స్ అయింది. స‌న్న న‌డుము అందాల‌తో కుర్ర‌కారు మ‌తి పోగొట్టింది. దీంతో ఆ పిల్ల‌కు ఏకంగా బుల్లితెర ఫేమ‌స్ షో అయిన ఢీ ఛాంపియ‌న్స్ లో ఛాన్స్ ద‌క్కింది. హా ఆమె ఎవ‌రో మాకు తెలిసిందిలే అంటారా. అవును ఆమెనే దీపికా పిల్లి. ఈ పిల్ల అందం, అభిన‌యంతో ఎక్క‌డా లేని అభిమానుల‌ను సంపాదించుకుంటోంది. టిక్ టాక్ వీడియోలు చేసుకునేట‌ప్పుడు అందులో టాప్ స్టార్ గా కొన‌సాగింది.


ఆ క్రేజ్ తో సోషల్ మీడియా అకౌంట్లు తెరిచి మిలియ‌న్ల కొద్ది ఫాలోవ‌ర్స్ ను సంపాదించుకుంది. ఆమె ట్యాలెంట్‌, అందాన్ని గుర్తించిన ఢీ ఛాంపియ‌న్స్ షో మేక‌ర్స్ ఆమెను స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా ఉంటుంద‌ని తీసుకున్నారు. ఇక ఆమె ఢీలో బాగానే పేరు తెచ్చుకుంటోంది. శేక‌ర్ మాస్ట‌ర్ తో కూడా స్టెప్పులేస్తూ.. ఢీ ప్రోగ్రామ్ లో సెగ‌లు పుట్టిస్తోంది. ఈమె డ్యాన్సు చేసేట‌ప్పుడు త‌న అందం రెట్టింపు అవుతోంద‌ని.. తోటి టీమ్ లీడ‌ర్లు కూడా కామెంట్ చేశారు.


ఇదిలా ఉంటే ఇక ఈ పిల్ల సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల కోసం వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ.. ఆగం జేస్తుంది. లేటెస్టుగా న‌డుము అందాల‌తో ఉన్న ఫొటోల‌ను నెట్టింట్లో వ‌దిలింది. లంగా ఓనీలో తెలుగింటి అందం అన్న‌ట్టు ఆ ఫొటోలు ఉన్నాయి. అందచందాల‌తో నెట్టింట ర‌చ్చ‌చేస్తున్నాయి ఆ ఫొటోలు. మ‌రి మీరు కూడా చూసేయండి.