బ్రేకింగ్: ఏపీ హైకోర్ట్ లో నేడు కీలక కేసులు…!

ఆంధ్రప్రదేశ్ లో హైకోర్ట్ లో నేడు కీలక కేసులు విచారణకు రానున్నాయి. ఏపీ హైకోర్ట్ లో రాజధానికి సంబంధించిన పిటీషన్ లను విచారిస్తారు. రాజధాని తరలింపుకి సంబంధించి దాఖలు అయిన పిటీషన్ లపై విచారణ జరుగుతుంది. అదే విధంగా… పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి కూడా విచారణ ఉంటుంది. దీనిపై హైకోర్ట్ ఏ తీర్పు ఇస్తుంది అనే ఆసక్తి అందరిలో పెరుగుతుంది.

అలాగే పదో తరగతి ఇంటర్ పరిక్షలకు సంబంధించి కూడా నేడు విచారణ జరుగుతున్న నేపధ్యంలో తీర్పు ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి ఉంది. నిన్న ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయినా సరే పదో తరగతి పరిక్షలకు సంబంధించి నిర్ణయం మాత్రం ప్రకటించలేదు. దీనిపై హైకోర్ట్ ఎటువంటి సూచనలు చేస్తుంది అనేది ఆసక్తిగా ఉంది.