డాక్టర్‌ తో ప్రేమలో పడ్డ దీప్తి సునయన..ఫోటోలు వైరల్‌ !

-

ఈ మధ్య సెలబ్రీటీలకు బ్రేకప్‌ చెప్పుకోవడం, విడాకులు ఇవ్వడం కామన్‌ అయిపోయింది. అమీర్‌ ఖాన్‌ నుంచి సమంత వరకు ఇలా చాలా మంది చిత్ర పరిశ్రమలో తమ వైవాహిత సంబంధాలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతున్నారు. అలాగే లవ్‌ లో ఉన్న వాళ్లు.. బ్రేకప్‌ చెప్పుకుని.. బతికేస్తున్నారు. చిన్న, చిన్న కారణాలు చూపి.. విడిపోతున్నారు సెలబ్రీటీలు. ఈ కోవలోకే దీప్తీ సునయన, షణ్ముఖ్‌ కూడా వస్తారు. సరిగ్గా కొత్త సంవత్సరం జనవరి 1 వ తేదీన బ్రేకప్‌ చెప్పుకుంది ఈ జంట.

కొత్త సంవత్సరం వేళ అభిమానులకు షాక్ ఇస్తూ..వారిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. అయితే.. తాజాగా దీప్తి సునయన తాజాగా తన సోషల్‌ మీడియాలో మరో వ్యక్తి తో దిగిన ఫోటోలు షేర్‌ చేసి.. అందరికీ షాక్‌ ఇచ్చింది. ఆనంద్‌ అనే వ్యక్తితో చాలా చనువుగా ఫోటోలు దిగి.. షేర్‌ చేసింది సునయన. మై బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూనే పక్కన లవ్‌ సింబల్స్‌ పెట్టి… ఫోటోలను షేర్‌ చేసింది.

ఆ ఫోటోలు చూస్తుంటే.. ఆనంద్‌ అనే వ్యక్తి డాక్టర్‌ అని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు… ఆమెపై మండిపడుతున్నారు. షణ్ముఖ్‌ ను అందుకే వదిలేవా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మంది సూపర్‌ జోడి అంటున్నారు. అయితే.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కోసమే ఈ ఫోటో షూట్‌ జరిగిందని.. తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news