NTR: దేవర మూవీ OTT డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

-

Devara OTT Release Date and Platform: జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా దేవర. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటిటి డేట్ కూడా ఫిక్స్ అయిందట. 8 వారాలు అంటే దాదాపు 50 రోజుల తర్వాత ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయబోతుందట చిత్ర బృందం. నెట్ ఫ్లిక్స్ లో దేవర సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Devara OTT Release Date and Platform

ఈ సినిమాను భారీ ధరకే నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. రాత్రి ఒకటి గంట నుంచే ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతోదేవర సినిమాను ఎగబడి చూస్తున్నారు జనాలు. అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో దేవర సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news