‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ హీరో ఎన్టీఆర్ నటించిన దేవర 1సెప్టెంబర్ 27న విడుదలై ఇప్పటివరకు రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. దేవరను విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ.. ఓ స్పెషల్ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎన్టీఆర్.
“దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులు సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, తదితర నటీనటులకు ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి మా కథకు జీవం ఇచ్చారు. నా దర్శకుడు కొరటాల శివగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయింది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించారు. రత్నవేలు సర్ సినిమాటోగ్రఫీ, సాబ్ సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ తో అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు, థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. మీరు చూపించే ప్రేమ, అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎల్లప్పుడూ గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. దేవర చిత్రాన్ని మీ భుజాల పై మోసి ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్ నోట్ రాశారు ఎన్టీఆర్.