తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్లు, బ్రిడ్జిలకు సంబంధించి మాట్లాడేందుకు ఫోన్ చేస్తే.. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై మంత్రి కోమటిరెడ్డి అధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజామాబాద్ లోక్ సభ పరిధిలో 7 చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామన్నారు.
రూ.93 కోట్లతో చేపట్టిన మాధవనగర్ ఆర్వోబీ 2 లైన్ ను 4 లైన్ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు, బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వం నిధులు డిపాజిట్ చేసినా రాష్ట్ర
ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. రైల్వే రంగాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. జిల్లాకు
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నా వల్లే జిల్లాలో కాంగ్రెస్
బలహీనపడిందన్నారు. కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.