మైమరిపిస్తున్న మెలోడీ.. దేవి ఈజ్ బ్యాక్.

నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రంగ్ దే చిత్రం నుండి మొదటి పాట రిలీజైంది. ఏమిటో ఇది వివరించలేనిదీ అంటూ సాగే ఈ పాట చెవులకి ఇంపుగా, సరికొత్తగా ఉంది. మది ఆగమన్నదీ, తనువాగనన్నది అన్న మాటలు వింటుంటే, ఈ పాటలో నితిన్, కీర్తి సురేష్ ల మధ్య రొమాన్స్ అదిరిపోనుందని అర్థం అవుతుంది. చాలా సున్నితంగా, సుమధురంగా అనిపిస్తున్న ఈ పాటతో దేవి శ్రీ ప్రసాద్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసినట్టే అనిపిస్తోంది.

గత కొన్ని రోజులుగా దేవి శ్రీ ప్రసాద్ పై చాలామందికి కంప్లైంట్స్ ఉన్నాయి. కొట్టిన ట్యూన్లనే కొడుతున్నాడని విమర్శించారు. కానీ రంగ్ దే సినిమాలోని ఈ పాటతో ఆ విమర్శలన్నీ తొలగిపోతాయి. రంగ్ దే చిత్రానికే కాదు నిన్న రీలీజైన ఉప్పెన చిత్రంలోని రంగులద్దుకున్న పాటకి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాల ఆల్బమ్స్ బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమాలతో దేవి మళ్ళీ నంబర్ వన్ స్థానంలోకి వచ్చేలా ఉన్నాడు.