కొరటాలకు చిరంజీవి కండీషన్లు పెట్టారా…? అలా అయితేనే చేస్తానని చెప్పిన మెగాస్టార్…!

-

ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ఒక మోస్తరు విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఈసారి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే 152వ సినిమా విషయమై చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్. సైరా సినిమాను రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. సినిమా ఎంతో లావిష్ గా, భారీ లెవెల్లో తెరకెక్కినప్పటికీ కూడా ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో మెజారిటీ ప్రేక్షకులు సినిమాపై పెదవి విరిచారు.

Chiranjeevi Begins Shoot in Palasa

ఇక అతి త్వరలో కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ నటించబోయే సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ కూడా కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతున్నప్పటికీ, ఈ సినిమా విషయమై దర్శకుడు కొరటాలకు కొన్ని ప్రత్యేకమైన కండీషన్స్ ని మెగాస్టార్ మరియు చరణ్ పెట్టినట్లు ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమా కథ కూడా పాన్ ఇండియా అపీల్ తో ఉండాలని, అలానే అటు ఉత్తరాదితో పాటు ఇటు సౌత్ లో తమిళ్, మలయాళ ప్రేక్షకులను కూడా చేరువ చేసేలా తయారుచేయమని చెప్పారని, అందుకే ఈ సినిమా పూర్తి కథ సిద్ధం అయి సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంత ఎక్కువగా సమయం పట్టిందని అంటున్నారు.

మంచి మెసేజ్ ఓరియెంటెడ్ అంశంతో పలు కమర్షియల్ హంగులతో కొరటాల ఈ సినిమా కథను తాయారు చేసినట్లు చెప్తున్నారు. సైరాతో కొంత నిరాశచెందిన మెగాస్టార్, తప్పకుండా ఈ సినిమాతో మళ్ళి హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ని సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో బ్యాంకాక్ లో జరిపారు. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నటించబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జనవరిలో ప్రారంభించే అవకాశం కనపడుతోంది……..!!

Read more RELATED
Recommended to you

Latest news