విడాకుల విషయంలో నాగచైతన్య అబద్ధం చెప్పాడా? సమంత మాటలతో స్పష్టత..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత ఏడు సంవత్సరాలు పాటు ప్రేమించుకుని వివాహం చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలకు విడిపోవడంతో ఇండస్ట్రీలో అంతా చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత ఎవరికి వారు తమ కెరియర్లో బిజీ అయిపోయారని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా విడాకుల విషయంలో చైతన్య చెప్పిన మాటలలో నిజం లేదని సమంత ఇటీవల ఋజువు చేసింది. ఇక అసలు విషయంలోకి వెళితే విడాకుల తర్వాత మొదటిసారి తమ విడాకులకు గల కారణాలను నాగచైతన్య తెలియజేసే ప్రయత్నం చేశారు. అలా బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో నాగచైతన్యకు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురవగా.. ఇద్దరమూ సామరస్యంగానే విడాకులు తీసుకున్నామని. ఎలాంటి గొడవలు జరగలేదని , ఒకరికొకరు నచ్చే విడాకులు తీసుకొని ..ప్రస్తుతం సంతోషంగా ఉన్నామని నాగచైతన్య తెలిపారు.

కానీ ఇటీవల సమంత బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో కి హాజరయ్యి.. నాగచైతన్యను మాజీ భర్త అని సంబోధించడమే కాకుండా.. నాగచైతన్య తనను ఒకే గదిలో ఉంచితే పదునైన ఆయుధాలు, వస్తువులు లేకుండా చూసుకోవాలని కూడా తెలిపింది.ఈ లెక్కన చూసుకుంటే వీరిద్దరి మధ్య రగిలిపోయే గొడవలు ఉన్నాయి అని అర్థమవుతుంది. ఇక సమంత కూడా విడాకులు అంతసామరస్యంగా జరగలేదు అని విడాకుల సమయంలో ఎంతో బాధపడ్డాను అని, అన్ని తట్టుకొని ప్రస్తుతం ధైర్యంగా నిలబడగలిగాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అటు నాగచైతన్య ఇటు సమంత చెప్పిన మాటలను బట్టి చూస్తే నాగచైతన్య అబద్ధం చెప్పడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ మేటర్ చాలా సింపుల్ అనేది మీడియాకు తెలియడం కోసమే నాగచైతన్య అలా చెప్పాడా? లేక ఇందులో ఏదైనా మరో విషయం దాగి ఉందా ?అనే సరికొత్త చర్చకు రావడం గమనార్హం.కానీ ఎప్పటిలాగే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news