తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మాతలుగా.. సంతోష్ శోభన్ హీరోగా.. మాళవిక నాయర్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం అన్నీ మంచి శకునములే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ యుఎస్ లో సందడి చేసింది. అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా ఎలాంటి రివ్యూ ఇస్తున్నారు. ఇక ఈసారైనా సంతోష్ శోభన్ హిట్ అందుకున్నాడా లేదా అన్నది మనం చూద్దాం.
గోల్కొండ హై స్కూల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి బాల నటుడిగా పరిచయమైన సంతోష్ శోభన్ తన నటనతో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. వర్షం సినిమా లాంటి హిట్స్ ఇచ్చిన తన తండ్రి అకాల మరణంతో ఇండస్ట్రీలో తాను నిలబడాలన్న తపనతోనే ప్రయత్నిస్తున్నాడు. అయితే తండ్రి ఇమేజ్ ఎక్కడ ఉపయోగించుకోకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడాలన్న తాపత్రయంతోనే పనిచేస్తున్నాడు సంతోష్ శోభన్. ఇక సినిమా విషయానికి వస్తే.. పక్కా ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించారు. ఒక పాయింట్ ను పట్టుకొని సినిమా చేయడంతో అద్భుతమైన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.
#AnniManchiSakunamule disappoint chesindi. Moments lo shine avthadi cinema. There are some good laugh out loud moments, there are some good dramatic moments but overall ga cinema for the most part flat ga potha untadi. Oka climax lo thappithe never did the movie manage to make.. pic.twitter.com/E8aPL6CTUh
— Likith (@likitongue) May 18, 2023
ట్విట్టర్ రివ్యూస్ విషయానికి వస్తే.. సినిమాపై పాజిటివ్ గానే టాక్ వినిపిస్తోంది.. సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన ప్రేక్షకులు పాజిటివ్గా స్పందిస్తున్నారు. అంతే కాదు సినిమా బాగుంది అని.. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా చూసినంత సేపు చాలా హాయిగా, రిలాక్స్ గా అనిపిస్తుంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెంచేలా ఫస్ట్ హాఫ్ ఉందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ అయిపోగానే సెకండ్ హాఫ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల సెకండ్ హాఫ్ ఆగిపోయిందట. ఇది చూసిన ఆడియన్స్ అంతా కూడా రెండవ భాగంపై చాలా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సెకండ్ హాఫ్ చూసిన మరికొంత ప్రేక్షకులు కామెడీ వర్కౌట్ అయిందని, అయితే అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ సిబ్బంది పెట్టాయని చెబుతున్నారు. మొత్తానికైతే మిక్సడ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా
Everything is so good about this film , loved every bit of it . Good story , good acting , music and a warm feeling , I’ll go again 🧡#AnniManchiSakunamule
— Toronto Saab (@saketh9) May 18, 2023