వేసవిలో హైదరాబాద్ టు అండమాన్ టూర్.. ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు..!

-

వేసవిలో ఏదైనా ఒక మంచి టూర్ వేసేయాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. ఈరోజుల్లో చాలా మంది నచ్చిన టూర్స్ ని వేస్తున్నారు. ఐఆర్‌సీటీసీ టూరిజం వివిధ ప్యాకేజీలని తీసుకు వస్తోంది. ఈ ప్యాకేజీలతో చక్కగా నచ్చిన ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. అమేజింగ్ అండమాన్ పేరు తో ఈ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. సమ్మర్‌లో అండమాన్ టూర్ వెళ్లాలంటే ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్. ఈ టూర్ ప్యాకేజీ మే 26న అందుబాటులో ఉంటుంది. పోర్ట్‌బ్లెయిర్, హేవ్‌లాక్ ఐల్యాండ్, నీల్ ఐల్యాండ్, రాస్, నార్త్ బే ఐల్యాండ్ వంటివి ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి.

అండమాన్ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో స్టార్ట్ అవుతుంది. ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్‌ లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 9.15 గంటలకు పోర్ట్‌బ్లెయిర్ రీచ్ అవుతారు. హోటల్‌లో చెకిన్ అవ్వాలి. లంచ్ తర్వాత సెల్యులార్ జైల్ మ్యూజియం చూడచ్చు. తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్‌కు వెళ్ళాలి. సాయంత్రం సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షో చూడొచ్చు. ఇక రెండవ రోజు హేవ్‌లాక్ ఐల్యాండ్ క్రూజ్‌ ట్రిప్ ఉంటుంది. రాధానగర్ బీచ్ చూడొచ్చు. రాత్రికి హేవ్‌లాక్‌లో ఉండాలి. మూడవ రోజు కాలాపత్తర్ బీచ్‌కు వెళ్లాలి. తర్వాత నీల్ ఐల్యాండ్‌కు వెళ్లాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత లక్ష్మణ్‌పూర్ బీచ్‌కు వెళ్ళాలి.

నాలుగో రోజు హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత భరత్‌నగర్ బీచ్‌ చూడచ్చు. గ్లాస్ బాటమ్ బోట్ రైడ్, వాటర్ స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్ ఉంటాయి. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో ఉండాలి. ఐదవ రోజు రాస్ ఐల్యాండ్‌. తర్వాత నార్త్ బే ఐల్యాండ్. ఆ తర్వాత తిరిగి పోర్ట్‌బ్లెయిర్ వెళ్లాలి. సముద్రిక మెరైన్ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ చెయ్యచ్చు. ఆరవ రోజు తిరుగు ప్రయాణం. ఉదయం 9.55 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్ వచ్చేయచ్చు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ధర రూ.42,885, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.43,170, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.55,780 పే చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Latest news