శివగామి పాత్ర రమ్యకృష్ణకు ఇంత నష్టం చేసిందా…?

-

‘నామాటే శాసనం ‘ అంటూ బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ కళ్లేర్ర చేసి చెప్పిన ఈ డైలాగ్ ను సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ మరువలేదు. ఈ సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన అద్భుతం. బాహుబలి సినిమా కు ఈమె పాత్రే కీలకం. ఒక రకంగా సినిమాను ముందుకు నడిపిన పాత్ర శివగామి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రమ్యకృష్ణ తప్ప ఈ పాత్రకు మరెవ్వరూ న్యాయం చేయలేరనే ప్రశంసలు దక్కాయి.

అయితే ఆ పాత్రే ఇప్పుడు ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టింది. రమ్యకృష్ణ ఏకంగా బాహుబలి సినిమాలో తాను నటించకపోయి ఉంటే బావుండు అని కొందరి వద్ద తన బాధ వ్యక్తం చేసిందట. దీనికి కారణం కూడా ఆమె చెప్పింది. శివగామి లాంటి పాత్రలు మాటిమాటికీ రావు, కానీ శివగామి పాత్రలో చూసిన ప్రేక్షకులు తరువాత కూడా అటువంటి ఇమేజ్ ఉన్న పాత్రలనే నా నుంచి కోరుకుంటారు.

కాబట్టి బాహుబలి సినిమాలో శివగామి కి వచ్చిన ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని తరువాత ఆమెకు పాత్రలు ఇచ్చే వాళ్ళు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఆమె నుంచి అభిమానులు సాఫ్ట్ పాత్రలను స్వాగతించడం లేదు. ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news