రమ్యకృష్ణను ఆ స్టార్ డైరెక్టర్ అంత దారుణంగా అవమానించారా..?

-

ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా సరే నటీనటుల హోదా మరియు స్థార్ డమ్ మాత్రమే అందరికీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వారు గతంలో ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు ఇలా వాటి గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడు సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్న ఎంతో మంది హీరోయిన్లు గతంలో చాలా కష్టపడి కష్టాలను దాటి వచ్చిన వారే అని చెప్పవచ్చు. అలాంటి వారిలో తెలుగులో విభిన్నమైన సినిమాలలో నటించి హీరోయిన్గా పేరుపొందిన రమ్యకృష్ణ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ప్రస్తుతం ఇప్పుడు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.

ప్రముఖ సినీ దర్శకుడు అయిన రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా మళ్లీ పాపులారిటీ సంపాదించుకుంది రమ్యకృష్ణ. దాంతో పలు సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంది. రమ్యకృష్ణ 100కు పైగా సినిమాలలో హీరోయిన్గా నటించి అద్భుతంగా ఆకట్టుకున్నది. ప్రస్తుతం రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో కూడా నటిస్తూ అంతే విధంగా ఆకట్టుకుంటోంది. అయితే రమ్యకృష్ణకు ఈ స్టార్ సెలబ్రిటీ హోదా మాత్రం అంత సులువుగా దక్కలేదని చెప్పవచ్చు. ఇక ఇమే కెరియర్ లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియకపోవచ్చు వాటి గురించి చూద్దాం.

అయితే అప్పట్లో వినిపించిన సమాచారం ప్రకారం..రమ్యకృష్ణ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఒక స్టార్ డైరెక్టర్ దగ్గరకు వెళితే అతడు ఏకంగా కొన్ని అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ నువ్వు ఇలాంటి వాటికి మాత్రమే పనికొస్తావని నువ్వు హీరోయిన్ గా నటించలేవని ఘోరంగా అవమానించాడట దాంతో రమ్యకృష్ణ చాలా అవమానంగా ఫీల్ అయ్యి..ఆ డైరెక్టర్ మాటలను చాలెంజ్గా తీసుకొని స్టార్ హీరోయిన్గా నటించడానికి చాలా కష్టపడిందట. అందుకోసం కొన్ని నిద్రలేని రాత్రులు కూడా గడిపిందట. అలా దాదాపుగా పదేళ్లపాటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలింది రమ్యకృష్ణ. ఇక అంతే కాకుండా ఆ డైరెక్టర్ వచ్చి తన సినిమాలో నటించాలని తన డేట్లు ఇమ్మని అడిగే రేంజ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news