Ravanasura : ‘రావణాసుర’ నుంచి ఐటమ్‌ సాంగ్..రబ్బరు గాజులంటూ రచ్చ

-

టాలీవుడ్‌ మాస్‌ మహారాజ్‌ హీరో రవితేజ..వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్‌ లో పెట్టారు ఈ మాస్‌ మహారాజు. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.

ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా రావణాసుర ఐటమ్‌ సాంగ్‌‌ రిలీజ్‌ అయింది. కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ సాంగ్‌ ను కాసేపటి క్రితమే రిలీజ్‌ చేశారు. ఇక ఈ పాట ఇప్పుడు యూత్‌ కు పిచ్చెక్కిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news