ఘనంగా దిల్ రాజు మనవరాలు “ఇషికా” అన్నప్రాసన..!

-

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆనందానికి నేడు అవధులు ఉండటం లేదు. అంతగా సంబరంలో మునిగి తేలుతున్నారు. ఈ రోజు ఆయన మనవరాలు ఇషికా అన్నప్రాసన వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ వేడుక కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హన్షిత రెడ్డి, అర్చిత్ రెడ్డి కి 2014 మే 2 న తమిళనాడులోని ఊటీ లో పెళ్లి జరిగింది. ఈ ఇద్దరి దంపతులకు అరాంశ్ అనే బాబు ఉన్నాడు. ఇక సంక్రాంతి కి రిలీజైన సరిలేరు నీకెవ్వరు సినిమా టైంలో దిల్ రాజుకి మనవరాలు పుట్టింది. ఆ పాపే ఇషికా. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది హన్షిత రెడ్డి. ఈ నేపథ్యంలో సకుటుంబ సమేతంగా హైదరాబాద్ లోని ఒక దేవాలయంలో ఇషికా అన్నప్రాసన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఇక దిల్ రాజు ముద్దుల మనవరాలు తో దిగిన ఫొటోలు సన్నిహితుల తో పాటు సోషల్ మీడియా వేదికగా అభిమానులతోను పంచుకున్నారు. ఇక అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో దిల్ రాజు మనవడు అరాంశ్ నటించిన విషయం చాలా తక్కువమందికే తెలుసు.

Read more RELATED
Recommended to you

Latest news