ట్రెడిషనల్ లుక్ లో అందరిని అలరిస్తున్న దిల్ రాజు భార్య..!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తూ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాతగా ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలను.. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. ముఖ్యంగా ఇలా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అనిత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మొదటి భార్య మరణించడంతో ఒంటరిగా గడుపుతున్న దిల్ రాజుకు తన కూతురు రెండవ వివాహం చేశారు. ఇలా తేజస్విని అనే అమ్మాయిని 2020 సంవత్సరంలో అతి కొంతమంది సమక్షంలో దిల్ రాజు రెండవ వివాహం చేసుకున్నారు. ఇక వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న దిల్ రాజు భార్య ఇటీవలే ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం తన కొడుకుతో ఆనందమైన క్షణాలను గడుపుతూ సంతోషంగా జీవిస్తోంది. సాధారణంగా తేజస్విని ఎక్కడా కూడా బయట కనిపించదు. కానీ తాజాగా ఈమె ఫోటోలు ప్రస్తుతం కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

ట్రెడిషనల్ లుక్ లో సాంప్రదాయ బద్దంగా చీర కట్టుకొని ఒంటినిండా నగలు ధరించి చాలా అందంగా ముస్తాబయి ఉన్నటువంటి తేజస్విని ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈమెను చూసిన చాలా మంది నెటిజన్స్ బ్యూటిఫుల్.. సూపర్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. హీరోయిన్ రేంజ్ ఫోటోల మాదిరిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ ,రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక మరొకవైపు విజయ్ దళపతి హీరోగా నటించిన వారసుడు సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దిల్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news