బాలయ్య సరసన ఐటమ్ సాంగ్ లో డింపుల్ హయాతి

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకి టైటిల్ ఇంకా ప్రకటించలేదు. ఇదో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్య పై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటకి తమన్ సంగీతం అందించారు.

ఈ పాటలో బాలయ్య సిగ్నేచర్ స్టెప్పులు అదరగొట్టేశారు అని సమాచారం. అయితే ఈ పాట హీరో ఇంట్రడక్షన్ సాంగే అయినా.. ఓ రకంగా ఐటమ్ సాంగ్ లా ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ పాటలో డింపుల్ హయాతి బాలయ్యతో కలిసి స్టెప్పులు వేయబడుతుందని టాక్. కిలాడి సినిమా లో రవితేజ తో నటించింది డింపుల్ హయాతి. ఆ సినిమా ఫ్లాప్ అయినా డింపుల్ కి బాగానే అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాలో ఆఫర్ కొట్టేసింది డింపుల్ హయాతి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news