టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి రామానాయుడు గారి వారసత్వంతో సినిమా ఇండస్ట్రీకి కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంటర్ అయిన నటుడు దగ్గుబాటి వెంకటేష్. తొలి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వెంకీ, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుని, అప్పటి టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. ఇక కొన్నేళ్ల పాటు వరుస విజయాలు అందుకోవడంతో ఆయనకు అప్పట్లో విక్టరీ వెంకటేష్ అనే పేరు వచ్చింది. కాగా ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి వెంకీ నటించిన ఎఫ్2 సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్న వెంకటేష్, అతి త్వరలో తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తెలుగులో అసురుడు అనే టైటిల్ కూడా పెట్టాలని సినిమా యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ధనుష్ హీరోగా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా, అలరించే స్క్రీన్ ప్లే తో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన అసురన్ సినిమా ఇటీవల తమిళ నాట మంచి హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండగా, యువ దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఈ విషయాన్ని సినిమా యూనిట్, కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియపరిచింది. ఇకపోతే ఈ సినిమాలో వెంకీ సరసన శ్రియ జోడి కట్టనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. తమిళ కథను కొద్దిపాటి మార్పులతో మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చిత్రీకరించనున్నారట. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జూన్ సమయానికి రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి జరగాబోయే అధికారిక పూజా కార్యక్రమాల సమయంలో మిగతా విషయాలన్నీ కూడా వెల్లడి కానున్నాయి…..!!