దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

-

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన కోడి రామకృష్ణ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దాసరి ప్రియ శిష్యుడైన కోడి రామకృష్ణ 1981లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. పాలకొల్లు నుండి వచ్చిన కోడి రామకృష్ణ దర్శకుడిగా 100 సినిమాలను పూర్తి చేశారు.

తెలుగు పరిశ్రమలో 100 సినిమాలను డైరెక్ట్ చేసిన వారిలో గురు శిష్యులు దాసరి, కోడి రామకృష్ణ ఉన్నారు. ఆ తర్వాత రాఘవేంద్ర రావు, కె.ఆర్ దాసులు మాత్రమే. దర్శకుడు కోడి రామకృష్ణ మరణ వార్త విని సిని పరిశ్రమ షాక్ అయ్యింది. ఫాంటసీ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్ అని చెప్పొచ్చు. అమ్మోరు, దేవుళ్లు, దేవి, అరుంధతి సినిమాలు ఆయన డైరక్షన్ లో వచ్చినవే. కోడి రామకృష్ణ మరణ వార్త విన్న టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news