ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా క్రిష్ డైరక్షన్ లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తుంది. కథానాయకుడు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా మహానాయకుడు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎన్.టి.ఆర్ మహానాయకుడు ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
ఎన్.టి.ఆర్ మహానాయకుడు.. కరెక్ట్ గా కథానాయకుడు ఎక్కడ ఆగిందో అక్కడ నుండి ఈ సినిమా మొదలవుతుంది. పార్టీ పెట్టడం వచ్చీరాగానే కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించడం జరుగుతుంది. ఎన్.టి.ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల గురించి చూపించారు. పార్టీలో చంద్రబాబు కీలకంగా మారడం జరుగుతుంది. అమెరికాకు వెళ్లిన ఎన్.టి.ఆర్ తిరిగి వచ్చే సరికి ఆయనకు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ రావు సిఎం అయ్యుంటాడు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ఎన్.టి.ఆర్ సిఎం అవుతాడు. ఈ ఎపిసోడ్ లో నేతలను ఢిల్లి తీసుకెళ్లే విషయంలో చంద్రబాబు చొరవ బాగా చూపించారు. బసవతారకం మరణంతో సినిమా ముగుస్తుంది.
ఎలా ఉందంటే :
ఎన్.టి.ఆర్ రాజకీయ కథ అందరికి తెలిసిందే. అయితే దాన్ని బాలకృష్ణ, క్రిష్ వారికి ఇష్టం వచ్చినట్టుగా తీశారు. ఎన్.టి.ఆర్ రియల్ లైఫ్ విలన్ అయిన చంద్రబాబుని హీరోగా చూపిస్తూ నాదెండ్ల భాస్కర్ రావుని విలన్ గా చూపించారు. ఎన్.టి.ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు అన్ని సరిగానే చూపించినా ఎన్.టి.ఆర్ గురించి బాగా ఎక్కువ చేసి చూపించినట్టు అవుతుంది.
ఎక్కడ ఆపేయాలో ముందే నిర్ణయించుకున్నారు కాబట్టి సినిమాను అర్ధాంతరమా ముగించారు. అయితే ఎన్.టి.ఆర్ జీవిత చరమాకంలో జరిగిన విషయాలు మాత్రం ప్రస్థావించలేదు. మహానాయకుడు కేవలం ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాత్రమే చూపించారు. బయోపిక్ అంటే మొదటి నుండి చివరి దాకా చూపించాలి కాని కేవలం కొంతవరకే కథ తీసుకున్నారు.
ఎన్.టి.ఆర్ చరమాకంలో విలన్ గా మారిన చంద్రబాబు గురించి మహానాయకుడులో హీరోగా చూపించడం సగటు ప్రేక్షకుడికి నచ్చలేదు. అంతా తెలిసిన ఎన్.టి.ఆర్ కథను వారికి ఇష్టం వచ్చినట్టుగా తీశారని చెప్పొచ్చు.
ఎలా చేశారు :
ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంది. విద్యా బాలన్ కూడా సహజంగా నటించారు. ఈ పార్ట్ లో చంద్రబాబుగా రానా నటన ఆకట్టుకుంది. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రాం నటన ఆకట్టుకుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కీరవాణి మ్యూజిక్ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. అప్పట్లో సినిమా అంటే సెట్ లు పెద్దగా లేకుండా మొత్తం అవుట్ డోర్ షూట్ చేశారు. క్రిష్ డైరక్షన్ పరంగా బాగున్నా మహానాయకుడు కథ విషయంలో జరిగిన కథను కాకుండా తమకు అనువుగా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ, విద్యా బాలన్ నటన
ఎమోషనల్ సీన్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ ల్యాగ్ అవడం
ఎడిటింగ్
బాటం లైన్ :
ఎన్.టి.ఆర్ మహ’నాయకుడే’.. కాని..!
రేటింగ్ : 2.5/5