‘ఆదిపురుష్’ టీజర్​పై ట్రోల్స్.. డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే..?

-

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా టీజర్​ విడుదలైనప్పటి నుంచి నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ లయన్ కింగ్ లాంటి ఆనిమేషన్ సినిమాలా ఉందని విమర్శిస్తున్నారు. ఈ ట్రోల్స్ పై తాజాగా సినిమా డైరెక్టర్ ఓం రౌత్ స్పందించారు.

- Advertisement -

“ఆది పురుష్‌ టీజర్‌ విడుదలైన తర్వాత వస్తున్న ట్రోలింగ్‌ చూసి నేను కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవం. అయితే, ట్రోలింగ్‌ వల్ల నేనేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సినిమా వెండితెర కోసం తీశాం. థియేటర్‌లో తెరసైజు తగ్గచ్చేమో కానీ, ఆ పరిమాణాన్ని మరీ మొబైల్‌కు తగ్గించకూడదు. అలా చేస్తే, అస్సలు బాగోదు. నాకు అవకాశం ఇస్తే, యూట్యూబ్‌లో పెట్టకుండా చేయొచ్చు. నాకు అది కేవలం ఓ గంట పని. కానీ, అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనూ యూట్యూబ్‌ ఆడియెన్స్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం” అని ఓం రౌత్ అన్నారు.

చిన్న తెరలపై చూడటానికి మాత్రం ‘ఆది పురుష్‌’ తీయలేదని పెద్ద తెరపై చూస్తేనే తాము తీసే కంటెంట్‌ విలువ తెలుస్తుందని మరోసారి డైరెక్టర్ ఓం స్పష్టం చేశారు. ‘ఆది పురుష్‌’ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌పై వస్తున్న ట్రోల్స్‌ నేపథ్యంలో ఇప్పటివరకూ తీసిన ఫుటేజ్‌ను మరింత మెరుగు పర్చేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...