స్టార్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ షాకింగ్ నిర్ణ‌యం!

-

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప‌నిచేసి హీరోలుగా మారిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. నాని, రవితేజ, అడవి శేషు వంటి వారు డైరెక్టర్‌ అవుదామని వచ్చి హీరోగా మారారు. దాసరి నారాయణరావు మాత్రం దర్శకుడిగా అగ్ర స్థానానికి చేరుకుని కొన్ని చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో న‌టించి మెప్పించారు. త్వరలో రామ్‌గోపాల్‌ వర్మ నటుడిగా మెరవనున్నారు. ఇక దర్శకులుగా మారిన కథానాయకులు కోకొల్ల‌లు. ఎన్టీఆర్‌ నుంచి మొన్న రాహుల్‌ రవీంద్ర వరకు చాలా మందే ఉన్నారు. తాజాగా టాలీవుడ్‌లో అనేక బ్లాక్‌ బస్టర్స్‌ అందించి, చాలా మంది హీరోల‌ని స్టార్స్ ని చేసి, స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన దర్శకుడు వి.వి.వినాయక్‌ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఆయన హీరోగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు.

Director VV Vinayak turns lead actor

ఆయన హీరోగా దర్శకుడు ఎన్‌.నరసింహారావు ఓ సినిమాని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని దిల్‌రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మించనుండటం విశేషం. ఇప్పుడీ వార్త టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎన్‌.నరసింహారావు ఇటీవ ‘శరభ’ అనే చిత్రాన్ని రూపొందించారు. వినాయక్‌ దర్శకుడిగా ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించారు. అందులో ఎన్టీఆర్‌తో ‘ఆది’, బాల‌కృష్ణ‌తో ‘చెన్నకేశవరెడ్డి’, నితిన్ ‘దిల్‌’, చిరంజీవి ‘ఠాగూర్‌’, అల్లు అర్జున్ ‘బన్నీ’, వెంక‌టేష్ ‘ల‌క్ష్మీ’,ర‌వితేజ ‘కృష్ణ‌’,  ప్ర‌భాస్ ‘యోగి’, ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌’, రామ్‌చ‌ర‌ణ్ ‘నాయక్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’, చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ వంటి విజయవంతమైన సినిమాల‌కు దర్శకత్వం వహించారు. ఆయన చివరగా డైరెక్షన్‌ చేసిన ‘ఇంటలిజెంట్‌’ పరాజయం చెందింది. ఆ తర్వాత బాకృష్ణతో ఓ మూవీ ఉంటుందని వార్తలు వినిపించాయి. దీనిపై ఇప్పటి వర‌కు క్లారిటీ రాలేదు.

ఈ నేపథ్యంలో వినాయక్‌ హీరోగా మారుతున్నారని  తెలిసి టాలీవుడ్‌ వర్గాలు ఆశ్చర్యంలో ఉన్నాయి. వినాయక్‌ ఫ్యాన్స్‌ సైతం కొంచెం సర్‌ప్రైజ్‌, మరికొంచె షాక్‌లో ఉన్నారు. ఇటీవ‌ల చాలా మంది రచయితలు దర్శకులుగా మారుతున్నారు. దీంతో వినాయక్ కి స‌రైన క‌థ‌లు దొర‌క‌డం లేదు. రైట‌ర్స్ లేరు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సినిమాలు బాక్సాఫీసు వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలుస్తున్నాయి. ఇక దర్శకుడిగా రాణించలేనని వినాయక్‌ హీరోగా టర్న్‌ తీసుకున్నారా? లేక కథకి ఆయన బాడీ లాంగ్వేజ్‌ డిమాండ్‌ చేసిందా? అన్నది మున్ముందు తెలుస్తుంది. మరో రెండు నెల‌ల్లో ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తుంది. మరి ఎలాంటి కథతో వినాయక్‌ హీరోగా రాబోతున్నాడ‌నేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Latest news