పది పాసైతే చాలు.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. కోస్ట్‌గార్డ్ ఉద్యోగాలు

-

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: నావిక్ (డొమస్టిక్ బ్రాంచీ-కుక్, స్టీవార్డ్)
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు ఐదుశాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2019, అక్టోబర్ 1 నాటికి 18-22 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1997 అక్టోబర్ 1 నుంచి 2001 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఎత్తుకు అనుగుణంగా ఛాతీ ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీలు వ్యాకోచించాలి.
జీతభత్యాలు: ప్రారంభవేతనం నెలకు రూ.21,700/- (లెవల్-3)తోపాటు అదనంగా డీఏ, ఇతర అలవెన్సులు ఇస్తారు.

Jobs notification released in coastguard with tenth class qualification

పదోన్నతులు: నావిక్ నుంచి ప్రధాన అధికారి వరకు పదోన్నతి పొందవచ్చు. ప్రధాన అధికారి పేస్కేల్ నెలకు రూ.47,600 + డీఏ.
ఇతర సౌకర్యాలు: రేషన్, దుస్తులు, కుటుంబంలోని అందరికీ ఉచిత వైద్యం, ఉచిత వసతి సౌకర్యం, 45 ఈఎల్స్, 8 సీఎల్స్, క్యాంటీన్ సౌకర్యం కల్పిస్తారు. పదవీ విరమణ తర్వాత ఈసీహెచ్‌ఎస్ వైద్య సౌకర్యం కల్పిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఎఫ్‌టీ, వైద్యపరీక్షల ద్వారా చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్ 5 నుంచి ప్రారంభం
చివరితేదీ: జూన్ 10
వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news