డిజాస్ట‌ర్ల ఎఫెక్ట్‌… ఈ టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌కు ఛాన్సుల్లేవ్‌

-

సినిమా అనేది ఓ మాయ ప్ర‌పంచం. ఇక్క‌డ హిట్ల‌లో ఉన్న వారికే క్రేజ్ ఉంటుంది. అప‌జ‌యాలు ప‌ల‌క‌రించే వారిని ఎవ్వ‌రూ ప‌ల‌క‌రించ‌రు. హీరోయిన్ల‌కు ఈ విష‌యంలో కాస్త వెసులు బాటు ఉన్నా.. హీరోలు, ద‌ర్శ‌కుల ప‌రిస్థితి మాత్రం వాళ్ల విజ‌యాన్ని బ‌ట్టే ఉంటుంది. హిట్లు ఉంటే వ‌రుస సినిమాలు వ‌స్తాయి.. మార్కెట్ పెరుగుతుంది. లేక‌పోతే వాళ్ల వైపు చూసేవాళ్లే ఉండ‌రు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొంద‌రు డైరెక్ట‌ర్లు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ఉన్న వారిని ప‌ల‌క‌రించే నాథుడే లేకుండా పోయాడు.  నాటి ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి నుంచి నేటి మహేష్ బాబు వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు చివర్లో వరుస ఫ్లాపులు ఇవ్వడంతో ఇప్పుడు సినిమాలు వదిలేసి రెస్ట్ తీసుకుంటున్నారు.

సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర‌ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు బి. గోపాల్  చివ‌ర్లో వ‌రుస ప్లాపులు ఇచ్చి ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పేశాడు. మహేష్ బాబుతో ఆగడు, ఎన్టీఆర్ కు బాద్ షా తో పాటు యంగ్ హీరోలకు ఎన్నో హిట్లు ఇచ్చిన శ్రీను వైట్లకు ఆగడు తర్వాత హిట్‌ లేక కనీసం ఏ హీరో అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి.

ఇక మాస్ దర్శకుడు వివి.వినాయక్ తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి బ్లాక్‌బ‌స్టర్ హిట్లు ఇచ్చాడు. ఇప్పుడు వ‌రుస ప్లాపుల‌తో డైరెక్షన్ వదిలేసి హీరోగా ట్రై చేస్తున్నాడు. వెంకటేశ్ మహేష్ లతో సీతమ్మ వాకిట్లో లాంటి భారీ మల్టీస్టారర్  తీసిన శ్రీకాంత్‌ను బ్ర‌హ్మోత్స‌వం దెబ్బ త‌ర్వాత ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. శ‌క్తి, షాడో, కంత్రిల ప్లాపుల‌తో మెహ‌ర్ ర‌మేష్‌ను జ‌నాలు మ‌ర్చిపోయారు.

విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ, దశరథ్, కరుణాకర్, గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకులు కూడా మొదట్లో హిట్స్ ఇచ్చి ఆ తరువాత వరుస ఫ్లాప్స్ తో ఇప్పుడు ఇండస్ట్రీకే దూరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అంతా కొత్త ద‌ర్శ‌కుల డామినేష‌న్ క‌నిపిస్తోంది. అది కూడా సినిమా హిట్ అయ్యి రేసులో ఉన్న వారికే ప‌ల‌క‌రింపులు వ‌స్తున్నాయి. లేక‌పోతే ఎంత గొప్ప ద‌ర్శ‌కుడు అయినా ఇండ‌స్ట్రీ వాళ్లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news