డిస్కో రాజా రివ్యూ : రవితేజ మూవీ హిట్టా ఫట్టా… సోషల్ మీడియా టాక్ ఇదే…!

-

దాదాపు రెండేళ్ళ తర్వాత మాస్ మహారాజ రవి తేజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ అక్బర్ ఆంటోని సినిమా తర్వాత రవి తేజా మళ్ళీ సినిమా చేయలేదు. విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమాతో రవి తేజా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సంక్రాంతి టైం లో ఇతర హీరోల సినిమాలు ఎక్కువగా ఉండటం, ఇప్పుడు సినిమాలు ఏమీ లేకపోవడంతో,

రవి తేజా ఈ సినిమాను జనవరి 26 కానుకగా విడుదల చేసాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాను రవితేజ ఇమేజ్‌కు తగ్గట్లు రాసుకుని, రవి తేజాకు ఉన్న మాస్ ఇమేజ్ ని వాడుకుంటూ కామెడిని కూడా పండిస్తూ సినిమాను రూపొందించాడు ఆనంద్. విదేశాల్లో ఈ సినిమా విడుదలై౦ది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అవ్వలేదు.

అక్కడి నుంచి వస్తున్న టాక్ ఆధారంగా చూస్తే ఈ సినిమా మంచి హిట్ సాధించింది అంటున్నారు చూసిన వాళ్ళు. చాన్నాళ తర్వాత రవి తేజా నుంచి అతని అభిమానులు కోరుకున్న సినిమా వచ్చిందని టాక్ వినపడుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా సినిమాపై పాజిటివ్ టాక్ వస్తుంది. నటన పరంగా రవితేజా తన మార్క్ చూపించాడు అంటున్నారు. ఇప్పుడు సినిమాలు ఏమీ లేవు కాబట్టి,

వసూళ్లు కూడా భారీగానే ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో రవి తేజా డ్యుయల్ రోల్ చేసాడు. ఇక సునీల్ కామెడి ఈ సినిమాకు ప్రధానంగా హైలెట్ గా నిలిచిందని టాక్. ఈ సినిమాతో మాస్ మహారాజా ప్రయోగం చేసాడని అంటున్నారు. వినోదంకి ఈ సినిమాలో ఏ మాత్రం లోటు లేదని, మాస్ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకోవడం ఖాయమని సోషల్ మీడియా అంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news