విడాకులు చైతుతో.. అక్కినేని ఫ్యామిలీతో కాదు.. సమంత కామెంట్స్ వైరల్..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత అక్కినేని ఇంటికి కోడలిగా నాగచైతన్య కి భార్యగా మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలి అంటే సమంత అంటే నాగార్జున దగ్గర నుండి అమల, అఖిల్ ,సుమంత్, సుశాంత్, ఆఖరికి వెంకటేష్ కూతుర్లకు , రానాకు, ఆయన భార్యకు కూడా సమంతా అంటే చాలా ఇష్టం.. కానీ చైతూ తో విభేదాల వల్ల తెగ తెంపులు చేసుకుంది అయితే అప్పుడు కూడా అక్కినేని ఫ్యామిలీ ఒక్క మాట కూడా అనలేదు. నాగ చైతన్య,  సమంత మధ్య తీర్చలేని విభేదాలు ఉండడం వల్లే వీరిద్దరూ సతమతమవుతుండడంతో ఎందుకు ఈ గొడవలు అని విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
విడాకులు తీసుకుని ఎవరికి వారు తమ కెరియర్లో బిజీగా మారారు.. మధ్యలో సమంత అనారోగ్యం పాలైనప్పుడు చైతూ ఒక ట్వీట్  వేస్తాడేమో.. ఆమెను ఆసుపత్రిలో పలకరించి వస్తాడేమో.. సమంతకి అండగా నిలబడతాడేమో.. అంటూ అందరూ అనుకున్నారు. కానీ అలా అనుకున్న వారందరికీ నిరాశ మిగిలింది అయితే సమంత చైతుకి మాత్రం విడాకులు ఇచ్చి దూరమైంది.  కానీ అక్కినేని ఫ్యామిలీకి కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది. తాజాగా అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ రిలీజ్ డేట్ తో పాటుగా ఒక పవర్ఫుల్ టీజర్ ని కూడా వదిలారు..
ఇది చూసిన సమంత లైక్ కొట్టడమే కాకుండా అఖిల్ మేకోవర్ ను  చూసి సమంత బీస్ట్ మోడ్ అంటూ కామెంట్ చేయడం అందరిని ఆకర్షించింది.  అది చూసిన అభిమానులందరూ కూడా సమంత..నాగ  చైతన్యకు మాత్రమే విడాకులు ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీకి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం ఇలానైనా సమంత అక్కినేని ఫ్యామిలీలో కలిసిపోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...