ఎన్టీఆర్ ఫేవరెట్ ఫిల్మ్ ఆ స్టార్ హీరోది అన్న సంగతి మీకు తెలుసా?

-

మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్..తెలుగు వారి ఫేవరెట్ యాక్టరే కాదు పొలిటీషియన్ అని చెప్పొచ్చు. సినీ, రాజకీయ రంగంలో ఆయన తనదైన పాత్ర పోషించారు. ముఖ్యంగా సినీ రంగంలో ఆయన పోషించిన పాత్రలు మరెవరూ పోషించలేరని సినీ పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.

పౌరాణిక, సాంఘీక, జానపద..ఇలా అన్నీ సినిమాలు చేసిన ఎన్టీఆర్ కు ఇష్టమైన సినిమా ఆయన నటించింది కాదండోయ్.. ఆ స్టార్ హీరో నటించిన పిక్చర్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ తనకు నచ్చిన సినిమాలను తన ఇంట్లోని హోమ్ థియేటర్ లో వేసుకుని చూస్తారు. అలా తాను పదే పదే వేసుకునే చూసే సినిమా ఒకటి తనది కాదండోయ్.. ఆయనకు బాగా నచ్చిన ఆ చిత్రం ‘భక్త కన్నప్ప’. 1954లో విడుదలైన రాజకుమార్ ‘భక్తకన్నప్ప’ అప్పట్లోనే అన్ని భారతీయ భాషల్లో డబ్బింగ్ అయింది. కన్నడ సూపర్ స్టార్ నటించిన ఆ పిక్చర్ అంటే ఆయనకు చాలా ఇష్టం.

ఈ మూవీని పలు సందర్భాల్లో మెచ్చుకున్న సీనియర్ ఎన్టీఆర్..అప్పటి నుంచి రాజ్ కుమార్ తో స్నేహం చేశారు.ఆ తర్వాత కాలంలో ‘భక్త కన్నప్ప’ పిక్చర్ లో నటించాలని ఆఫర్ వచ్చినా వదులుకుననారు. రాజ్ కుమార్ కు పోటీ కావద్దనే అలా చేశారు.

ఇక ఎన్టీఆర్ ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన క్రమంలో రాజ్ కుమార్ ఎన్టీఆర్ ను అభినందించారు. చనిపోయేంత వరకు కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ తో ఎన్టీఆర్ స్నేహాన్ని కొనసాగించారు. ఎన్టీఆర్ నట వారసులుగా ఆయన తనయుడు బాలయ్య సినిమాల్లోకి రాగా, రాజ్ కుమార్ వారసులుగా ఆయన తనయులు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ లు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news