ఆ హీరో షూస్ ధర ఎంతో తెలుసా …!?

-

ఎందుకంటే మన హీరోలు ఏం చేసినా కూడా బ్రాండే. ఎందుకంటే అంత బ్రాండింగ్ ఉన్న హీరోలు బాలీవుడ్ తర్వాత మన దగ్గరే ఉన్నారు. మన హీరోలు ఎండోర్స‌మెంట్ చేయడంలో కూడా ముందుంటారు. దానికితోడు అవసరం వచ్చినపుడు తమకు తాము బ్రాండ్స్ కూడా బాగానే ప్రమోట్ చేస్తుంటారు.. వాటినే ధరిస్తూ కనిపిస్తుంటారు కూడా. జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ యంగ్ టైగర్. నటనతో బ్రాండ్ అంబాసిడర్ అయిన తాతయ్య నుంచి ఆ లక్షణాల్ని అందిపుచ్చుకున్నాడు.

కేవలం నటనలోనే కాదు..ధరించే ప్రతి వస్తువూ బ్రాండెడే. ఇప్పుడు కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేసాడు. తాజాగా ఈయన వేసుకున్న ఓ షూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు డిజిటల్ మీడియాలో అలాంటి ఇమేజ్ ఉంది మరి. మొన్నటికి మొన్న తన కొడుకులతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పించాడు జూనియర్. ఈ ఫోటోలు రెండు రోజులు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అంత క్రేజ్ ఈయన సొంతం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఆయన వేసుకున్న షూస్ గురించి అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు.

ఇటీవల రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ చాలా వైరల్ అయింది. ఆ వాచ్ విలువ దాదాపు 30 లక్షల రూపాయలు. మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా లక్షలు వెచ్చించి..డ్రెసెస్, వాచెస్ కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న షూస్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ బ్రాండ్ అలాంటిది. చాలా కాస్ట్ లీ బ్రాండ్ అది. ఆ బ్రాండ్ పేరు HERMES. ఇవి కచ్చితంగా స్పెషల్ షూస్ కావడంతో అభిమానులు వెంటనే గూగుల్‌లో వెతికారు. ఆ షూస్ అక్షరాలా 75 వేలకు పైనే అని గూగుల్ చెప్పడంతో అభిమానులు అవాక్కయ్యారట. అంతే..ఇంకేముంది..ఇదీ మా యంగ్ టైగర్ రేంజ్ అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది. ఎందుకంటే తారక్‌కు ఉన్న ఫాలోయింగ్ అటువంటిది. వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news