ప్రముఖ నటి అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటి సౌందర్య 27 సంవత్సరాలు వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం అని చెప్పాలి. ఆమె సినిమాలలో అడుగుపెట్టడానికి గల కారణం కచ్చితంగా ఆమె తండ్రి ప్రోత్సాహమే.. ఎందుకంటే ఆమె తండ్రి స్వతహాగా రైటర్, నిర్మాత కూడా.. ఆయన నిర్మాతగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేశారు. అందుకే తండ్రి వారసత్వాన్ని సౌందర్య పుణికి పుచ్చుకుంది. అలాగే సౌందర్య అన్నయ్య అమర్నాథ్ కూడా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగారు.
సౌందర్య తో పాటు ఎల్లప్పుడూ ఆమె వెంటే ఉండే అమర్నాథ్ విమాన ప్రమాదంలో కూడా ఆమెతో పాటే కన్నుమూశాడు. సౌందర్య సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె తండ్రి కూడా కన్నుమూయడం జరిగింది. అయితే తండ్రి గుర్తుగా అతడికి ఒక సినిమా అంకితం చేయాలని భావించారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోని 1999లో ఒక కథ అనుకుని దాన్ని పూర్తిస్థాయిలో సినిమాగా మార్చడానికి 4 యేళ్లు పట్టింది. అలా 2002లో ద్వీప అనే సినిమాను తెరకెక్కించారు. పూర్తిస్థాయిలో కన్నడలోనే తెరకెక్కిన ఈ సినిమా అవార్డుల పంట పండించింది. ఏకంగా ఈ సినిమాకి ఫిలిం ఫేర్ తో పాటు 14 అవార్డ్ లు కూడా లభించాయి.
ద్వీప సినిమాలో సౌందర్య తండ్రి జ్ఞాపకార్థం మాత్రమే కాకుండా నిర్మాతగా మారి హీరోయిన్గా కూడా నటిస్తూ ఈ సినిమా తీయడం విశేషం. సత్యనారాయణ లాంటి తండ్రి దొరకడం ఆమె అదృష్టం. అందుకే తన తండ్రిని తన మొదటి గురువుగా భావిస్తుంది. ఇక సౌందర్య మొత్తం జీవితాన్ని ముందే ఊహించి ఆమె జాతకం రాశాడు సత్య నారాయణ. ఎందుకంటే ఆయనకు జ్యోతిష్యం కూడా తెలుసు. చిన్నవయసులోనే తాను చనిపోతుందని ఆలోపే అగ్ర ప్రధాన కథానాయకగా దూసుకుపోతుందని కూడా ఆయన అంచనా వేసి చెప్పాడు. తండ్రి చెప్పినట్టుగానే ఆమె అతి చిన్న వయసులోనే అగ్రస్థానానికి చేరుకొని స్వర్గస్తురాలు అయ్యింది.