బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఈ ఏడాది మార్చి నెలలో న్యూయార్క్ లో ఓ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీన ‘సోనా’ పేరిట ఇండియన్ వంటకాలను వడ్డించే ఓ రెస్టారెంట్‌ను ఆ ఇరువురు ప్రారంభించారు. అయితే ఆ రెస్టారెంట్ బాగానే నడుస్తోంది. పలువురు అమెరికన్ సెలబ్రిటీలు ఆ రెస్టారెంట్‌లో ఇండియన్ వంటకాలను రుచి చూస్తున్నారు.
ఇక తాజాగా ఆ రెస్టారెంట్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ అతని సోదరుడు కెవిన్ జోనాస్‌లు డిన్నర్ చేశారు. దీంతో వారు రెస్టారెంట్‌లో గడిపిన ఫోటోలను అందులో పనిచేసే మనీష్ గోయల్ షేర్ చేశారు. ఇక ఆ రెస్టారెంట్‌లో అందుబాటులో ఉన్న పలు ఇండియన్ వంటకాల ధరలకు చెందిన మెనూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ మెనూలో పలు వంటకాలకు చెందిన ధరలను చూడవచ్చు. ఇక ఒక్క సమోసా లేదా వడాపావ్‌కు ఏకంగా 14 డాలర్లు (దాదాపుగా రూ.1039) వసూలు చేస్తున్నారు. అలాగే ఇతర వంటకాలకు చెందిన ధరలు కూడా అలాగే ఉన్నాయి.
ఆ రెస్టారెంట్‌లో సమ్మర్ కార్న్ భెల్, హష్ బ్రౌన్ ఆలూ టిక్కీ, మటన్ ఎగ్ ఎదిల్, మసాలా ఎగ్స్, ఎగ్ అండ్ చీజ్ దోశ, మష్రూమ్ భుర్జి, పూరీలు వంటి అనేక భారతీయ వంటకాలను వడ్డిస్తున్నారు. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా రెస్టారెంట్ బాగానే పాపులర్ అయిందని చెప్పవచ్చు.