ఉర్ఫీ జావేద్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

-

ఫ్యాషన్ ఐకాన్ గా.. బాలీవుడ్ నటిగా.. బిగ్ బాస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే తాజాగా ఈమె నెలసరి ఆదాయం బాలీవుడ్ నటీమనులను కూడా దాటేస్తుందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ రకరకాల దుస్తులు , వింత వింత గెటప్ లలో పబ్లిక్ ప్లేస్ లోకి రావడంతో చాలాసార్లు విమర్శలు కూడా ఎదుర్కొంది కానీ ఆమె ఏ మాత్రం ఏ రోజు తన గ్లామర్ షో తగ్గించలేదు. అంతేకాదు విచిత్రమైన డ్రస్సులు , వింత హెయిర్ స్టైల్స్ తో కొత్త మోడల్ గా అందరూ దృష్టిని లాగేసుకుంది.

ఇకపోతే వెరైటీ కాస్ట్యూమ్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ముద్దుగుమ్మ పనికిరాని వస్తువులు.. పరికరాలతో దుస్తులను తయారు చేసుకొని.. ఇదే నా ఫ్యాషన్ అంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. వాస్తవానికి ఉర్ఫీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు, సీరియల్స్ లో నటించడం లేదు. కానీ నెలకు కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తోంది. అయితే ఇదంతా ఎలా సాధ్యం అనే విషయం ఇప్పుడు నెట్టింట మరింత వైరల్ గా మారింది. ఇకపోతే ఎవరికి నచ్చని విధంగా.. ఏ డిజైనర్ క్రియేట్ చేయని వినూత్నమైన డ్రెస్ లతో తన అందచందాలు చూపిస్తూ అందరిని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంది.

అంతే కాదు చాలామంది ఈమె వెరైటీ డ్రెస్సులకే ఫిదా అవుతున్నారు. అలా ఇంస్టాగ్రామ్ లో 4.1 మిలియన్ ల ఫాలోవర్స్ కలిగి ఉన్నారు.ఇకపోతే ఈమెకు సోషల్ మీడియా ద్వారానే లక్షల ఆదాయం వస్తుంది. అలాగే యాడ్స్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేస్తూ అక్కడ కూడా లక్షల్లో సంపాదిస్తోంది. గతంలో వెలువడిన కథనాల ప్రకారం బాలీవుడ్ హీరోయిన్ల కంటే ఎక్కువగానే సంపాదిస్తుందట. ఇక నెలకు రెండు కోట్లు లెక్కన ఈమె మొత్తం 172 కోట్ల రూపాయల వరకు సంపాదించారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news