నిర్మలమ్మ.. అందరూ ఆమెను అమ్మ అని పిలిచేవారు. అందుకే ఆమె పేరు నిర్మలమ్మగా మారింది. అమ్మగా, అమ్మమ్మగా , బామ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. తెలుగు సినిమా రంగం వయసు కంటే ఆమె వయసు పెద్దది..40 ఏళ్ల క్రితం ఆమెను చూసిన ప్రేక్షకులు అంతా మా బామ్మ అని మనసుకు దగ్గరగా భావించే వాళ్ళు. అంతగా ఆమె పాత్రల్లో లీనమైపోయి నటించేది. ఇక నిర్మలమ్మ జీవిత విషయానికి వస్తే.. ముందు నాటకాల్లో నటించేవారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను ఒక సినిమా షూటింగ్లో చూసి ప్రొడక్షన్ మేనేజర్ జీవి కృష్ణారావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే నిర్మలమ్మకు పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు. దీంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయి సినిమాలకి కూడా దూరంగా ఉంది. మరొకవైపు ఆమె భర్త కృష్ణారావుకి ప్రొడక్షన్ మేనేజర్ గా అవకాశాలు తగ్గాయి . ఆదాయం లేకుండా పోయింది . అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలోనే ఇద్దరు నాటక రంగంపై దృష్టి పెట్టి ఎన్నో నాటకాలు వేశారు. 1961 లో కృష్ణ నటించిన ప్రేమ అనే సినిమాలో ఈమెకు అవకాశం లభించింది. ఆ తర్వాత నుంచి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యింది. అక్కినేని నాగేశ్వరరావు , ఎన్టీఆర్ దగ్గరనుంచి మొదలు పెడితే చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్, నాగార్జున వంటి ఎంతోమంది సూపర్ స్టార్లకు ఆమె అమ్మగా , బామ్మగా నటించి తెలుగు తెరకు నిర్మలమైన నటనను అందించారు.
అయితే నిర్మలమ్మకి పిల్లలు లేకపోవడం వల్ల కవిత అనే ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంది. అలా ఆమెకు ఒక మనవడు వున్నాడు. అతని పేరు విజయ్ మాదాల. పడమటి సంధ్యారాగం అనే సినిమాలో గణపతి పాత్రలో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. శోభ అనే అమ్మాయిని వివాహం చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం అమెరికాలోనే ఉద్యోగం చేస్తూ సెటిల్ అయ్యారు.