పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మెగా వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్లో తన సినిమాలను విడుదల చేయకపోయినప్పటికీ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక పాన్ ఇండియా హీరోగా తాను ఒక సినిమా చేయకపోయినా సరే పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకోవడం కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే దక్కిందని చెప్పవచ్చు. నిజానికి సినీ ఇండస్ట్రీలో సినీ ప్రేక్షకులకు మాత్రమే అభిమాన హీరో, హీరోయిన్లు ఉంటారు అంటే పొరపాటే.. స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలకి కూడా అభిమాన హీరోలు ఉంటారటంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఇష్టమైన హీరో ఒకరు ఉన్నారట.

సెప్టెంబర్ రెండవ తేదీ అనగా రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా చాలా ఘనంగా అభిమానులు జరుపుకోబోతున్నారు. ఇక ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం జల్సాను కొన్ని వందల ధియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరెన్నో తెలియని విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యాక్షన్ కింగ్ అర్జున్ అంటే ఎనలేని ఇష్టమట. ఎప్పటికైనా సరే ఆయనతో నటించాలనే ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం.Pawan Kalyan Extends Support To Arjun Sarja's Big Project

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ వంటి సినిమా షూటింగ్లలో పాల్గొంటూనే ఇంకొక వైపు రాజకీయాలలో శరవేగంగా ప్రచారం చేపడుతున్నాడు. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా సరే తాను స్థాపించిన జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని , తాను ముఖ్యమంత్రిగా సీటు దక్కించుకోవాలనే ప్రయత్నంలో జోరుగా ప్రచారంలో అక్టోబర్ నుంచి పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియాలి అంటే ఇంకొక ఏడాది పాటు ఎదురు చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news