అనిల్ రావిపూడి ఫేవరెట్ హీరోయిన్ ఆమెనే.. అందుకే ఆమెతో అన్ని సినిమాలు..!

-

టాలీవుడ్‌లో అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న వారు అనిల్ రావిపూడి. ‘పటాస్’తో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి.. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ చవి చూడలేదు. ఇటీవల ‘F3’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు అనిల్ రావిపూడి. తన నెక్స్ట్ ఫిల్మ్ ను టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్యతో చేస్తున్నారు అనిల్.

అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా ఎంటర్ టైనింగ్ వేలో నే ఉన్నాయి. కాగా, ఇప్పుడు బాలయ్యతో చేయబోయే పిక్చర్ కొంచెం డిఫరెంట్ జోనర్ లో ఉండబోతున్నది. ఇకపోతే దర్శకుడు అనిల్ రావిపూడికి ఫేవరెట్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కౌర్ అని ఫిల్మ్ నగర్ సర్కి్ల్స్ టాక్.

మెహ్రీన్ పిర్జాద్ కౌర్ తో అనిల్ రావిపూడి ఇప్పటికే మూడు సినిమాలు చేయడం విశేషం, ‘F2’, ‘F3’తో పాటు ‘రాజా ది గ్రేట్’ సినిమాల్లో హీరోయిన్ గా మెహ్రీన్ పిర్జాదా కౌర్ నటించింది. అయితే, ఈ హీరోయిన్ ప్రజెంట్ జనరేషన్ లో అనిల్ రావిపూడికి ఫేవరెట్ కాగా, అప్పట్లో ఉన్న హీరోయిన్స్ లో నగ్మా అంటే అనిల్ రావిపూడికి చాలా ఇష్టం.

అనిల్ రావిపూడి బాలయ్యతో చేయబోయే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నగ్మాను తీసుకోవాలని అనిల్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. ఇందులో ‘బిగ్ బాస్’ ఓటీటీ ఫేమ్ బిందు మాధవికి ఓ పాత్ర ఇస్తానని అనిల్ రావిపూడి మాట ఇచ్చిన సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news