డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ తరుపున నేడు బెయల్ పిటీషన్

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ముంబై క్రుయిజ్ రేవ్ పార్టీలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు మరో 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈఘటన బాలీవుడ్లో కలకలం స్రుష్టించింది.  

ఈకేసు మొదలుకుని ముంబై లో పలుచోట్ల NCB అధికారులు సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తునా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్న ఆర్యన్ ఖాన్ ను NCB అధికారులు ప్రశ్నించారు. ఎన్నేళ్ల నుంచి డ్రగ్స్ వాడుతున్నారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే వివరాలను ఆరా తీశారు. ఈ విచారణలో ఆర్యన్ ఖాన్ పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారని సమాచారం. గత నాలుగేళ్లుగా ఆర్యన్ డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. వీటితో పాటు NCB అధికారులు స్వాధీనం చేసుకున్న ఫోన్ లో డ్రగ్స్ దందాకు సంబంధించి మరింత సమాచారం లభించినట్లు సమాచారం. నేటితో ఆర్యన్ ఖాన్ కస్టడీ ముగియడంతో షారుఖ్ ఖాన్ నేడ బెయిల్ అప్లై చేయనున్నారు.