సంక్రాంతి నుంచి ఔట్‌..ఫిబ్రవరి 9న రవితేజ ‘ఈగల్’ రిలీజ్..!

-

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఈగల్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా మరొక కీలకపాత్రలో కావ్య తాపర్ నటిస్తుంది. .ఈగ‌ల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ (𝗨/𝗔) స‌ర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది.

EAGLE from February 9th,2024

నిన్నటి వరకు ఈ నెల 13న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా…. ఇప్పుడు ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. కాగా, ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే చాలా థియేటర్లను ఈ సినిమాలే బుక్ చేసుకున్నాయి ఈ నేపథ్యంలో సంక్రాంతి బరి నుంచి రవితేజ తప్పుకోవడమే బెటర్ అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news