తెలుగు సినిమా సంక్షేమం కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నా అని హీరో రవితేజ తెలిపారు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంపై మాస్ మహారాజా రవితేజ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘మన తెలుగు సినిమా సంక్షేమం కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తున్న. రావడంలో మార్పు వచ్చింది. కానీ, టార్గెట్ లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 9న ఈగల్ రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని చిత్రాలకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
దీనికి ‘హార్ట్’ సింబల్ తో ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిప్లై ఇచ్చారు. కాగా, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది. నిన్నటి వరకు ఈ నెల 13న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా…. ఇప్పుడు ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. కాగా, ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ సినిమాలు రిలీజ్ కానున్నాయి.