లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై ఈసీ స్పందన ఇది..!

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను అడ్డుకునే క్రమంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన ఈ టైంలో మా పార్టీకి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందని టిడిపి శ్రేణులు ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేశారు. మార్చి 22న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేశారు. అయితే అనుకున్న టైంకు సినిమా వస్తుందా రాదా అన్నది పెద్ద సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈసీ రజత్ కుమార్ మాత్రం సినిమా విడుదలకు అడ్డుకోవడం కుదరదని తేల్చిచెప్పారు.

సినిమా రిలీజ్ తర్వాత అందులో ఎవరికైనా అనుకూల అంశాలు ఉన్నాయా..? ఓటర్లను ప్రభావితం చేసే సీన్స్ ఉన్నాయో లేదో చూసి. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే అప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పారు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై ఈసీ రెస్పాన్స్ టిడిపి షాక్ ఇచ్చింది. ఇదే విషయాన్ని చెబుతూ ఆర్జివి ట్వీట్ చేశాడు. సో రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.