తమన్నాని పెళ్లాడుతా అంటున్న హీరోయిన్..!

టైటిల్ చూసి ఇదేదో మిస్టేక్ పడ్డదా.. లేక ఇదేం విచిత్రం అని అనుకోవచ్చు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమన్నా, శృతి హాసన్ ఇద్దరు మంచి స్నేహితులు.. తమన్నా తర్వాతే ఇండస్ట్రీకి వచ్చినా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఈ ఇద్దరి మధ్య ఎంత మంచి రిలేషన్ ఉందో ఇప్పుడు మరోసారి బయటపడ్డది. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఫారిన్ బోయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్న శృతి హాసన్ రీసెంట్ గా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఒకవేళ మీరు అబ్బాయిగా పుడితే ఏ హీరోయిన్ ను ఇష్టపడతారు అని ప్రశ్న ఎదురైంది. అయితే దానికి వెంటనే తమన్నాతో డేటింగ్ కు వెళ్తా.. అంతేకాదు తమన్నాని పెళ్లాడుతా అంటుంది శృతి హాసన్. సో దీన్నిబట్టి తమన్నా, శృతి హాసన్ ఎంత క్లోజ్ అన్నది అర్ధం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో తమన్నా ఇప్పటికి మంచి కెరియర్ కొనసాగిస్తుండగా శృతి హాసన్ కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ సినిమాలు చేయాలని చూస్తుంది.