ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఎవ‌రు అవుట్ అంటే…!

తెలుగులో బిగ్ బాస్ 3 సీజ‌న్‌ ప్రారంభమై ఇప్పటికే 11 వారాలు కంప్లీట్ అయింది. ప్రస్తుతం బిగ్‌బాస్ విజయవంతంగా 12వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. షో మొత్తం 15 మంది కంటి స్టెంట్లతో ప్రారంభం కాగా వైల్డ్ కార్డు ద్వారా ట్రాన్స్‌జెండ‌ర్ తమన్నా సింహాద్రి, సీనియర్ యాంకర్ శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు తొమ్మిది మంది ఎలిమినేట్ కాగా హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఈవారం పునర్నవి భూపాలం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వచ్చేవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు… అన్నదానిపై అప్పుడే ఆసక్తికర చర్చలు స్టార్ట్ అయ్యాయి.

ఈవారం ఎలిమినేషన్ కు మొత్తం నలుగురు నామినేట్ అయ్యారు. వారిలో స్టార్ కపుల్ వరుణ్.. వితిక శేరు, రాహుల్ మరియు మహేష్ విట్టా ఉన్నారు. అయితే వితిక గ‌త వారం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన గోల్డెన్ మెడాలియ‌న్ టాస్క్‌లో విజేత‌గా నిలిచింది. ఆమె ఫైన‌ల్స్‌లో బాబా భాస్క‌ర్‌ను ఓడించి మ‌రీ మెడాలియ‌న్ గెలుచుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న మెడాలియ‌న్ త్యాగం చేస్తే ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకొనే అవకాశం ఉండటంతో ఆమె ఆ అవకాశం ఉపయోగించుకొని, ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యింది.

ఇక ఈ వారం వితిక ఎలిమినేష‌న్లో ఉంటే ఆమె వీక్ కంటెస్టెంట్ అన్న టాక్ ఉన్న నేప‌థ్యంలో బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్సులే ఎక్కువుగా ఉండేవి. అయితే మెడాలియ‌న్ త్యాగం చేయ‌డంతో ఆమె సేఫ్ అయ్యింది. ఇక మిగిలిన ముగ్గురిలో వ‌రుణ్‌కు హీరో ఇమేజ్‌తో పాటు బ‌య‌ట ఫ్యాన్స్ కూడా ఎక్కువే. అందులోనూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావ‌డంతో వ‌రుణ్‌కు ఇబ్బంది లేదు. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చేది రాహులా.. లేదా మ‌హేష్ విట్టానా ? అన్న‌ది చూడాలి.

ఇక హౌస్‌లో శ్రీముఖి గ్యాంగ్ వ‌రుస‌గా రాహుల్‌ను టార్గెట్ చేయ‌డం… అత‌డు వ‌రుస‌గా ఎలిమినేట్ అవుతూ సేఫ్ అవ్వ‌డంతో అత‌డు కూడా ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు. బ‌య‌ట రాహుల్‌కు ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో రాహుల్ సేఫ్ అయ్యే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాయి. పున‌ర్న‌వి ఎలిమినేట్ అయ్యాక రాహుల్‌కు సింప‌తీ పెరుగుతోంది. మ‌రి మ‌హేష్ విట్టా ఎలిమినేట్ అవుతాడా ?  లేదా సంచ‌ల‌నం క్రియేట్ చేస్తాడా ? అన్న‌ది చూడాలి.