‘ఎంత మంచివాడవురా’ ఆఖరి షెడ్యూల్‌

-

చాలా గ్యాప్ తరువాత నందమూరి కల్యాణ్‌రామ్ ‘118’ సినిమా ద్వారా మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఇదే జోష్‌తో కల్యాణ్‌రామ్ మరో సినిమాకు సైన్ చేశాడు. ఆ సినిమా కూడా కథా కథనాలతో పాటు కొత్త లుక్, పాత్ర విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాడు.

నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్ని , తెలుగు కుటుంబ ప్రేక్షకుల హృదయాల్నీ గెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో శరవేగంతో ఈ సినిమా రూపొందుతోంది. మూడు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతోన్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి రేసుకు సిద్ధమవుతోంది. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సుమారు 40 మంది వరకు ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. ఇటీవలే మూడో షెడ్యూలు చిత్రీకరణ పూర్తి చేసుకుని, ఆఖరి షెడ్యూలుకు సిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news